వరంగల్, కాజీపేట, హన్మకొండతో పాటు...ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 44, 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతుంటే... మధ్యాహ్నానికి తీవ్ర స్ధాయికి చేరుకుంటోంది. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే తలకు రుమాలు, ముఖానికి గుడ్డలు కట్టుకుని వాహనదారులు బయటకి వస్తున్నారు. వేడిగాలుల కారణంగా పిల్లలు, వృద్ధులు వడదెబ్బలకు గురవుతున్నారు. గతంతో పోలిస్తే ఎండలు అధికంగా ఉన్నాయని... వేడిమిని భరించలేకపోతున్నామని నగరవాసులు చెపుతున్నారు.
ఓరుగల్లును హడలెత్తిన్న భానుడు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నగర రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఓరుగల్లును హడలెత్తిన్న భానుడు