వరంగల్ అర్బన్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప... బయటకు రావడం లేదు. ఎండ వేడిమికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమికి అందరూ ఇంటికే పరిమితం అవడం వల్ల రోడ్లు బోసిపోయాయి. ఎండకు తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. హన్మకొండలో 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయింది.
మండుతున్న ఎండలు - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. హన్మకొండలో 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయింది.
మండుతున్న ఎండలు