పెట్రో ధరలకు నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ ఆధ్వర్యంలో ఎద్దుల బండితో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ ఎద్దుల బండి ఎక్కబోతుండగా.. ఒక్కసారిగా ఎద్దులు పరుగులు తీశాయి. కొంతదూరం వెళ్లాక బండి తిరగబడింది.
హన్మకొండలో కాంగ్రెస్ నిరసనలో అపశ్రుతి - హన్మకొండలో కాంగ్రెస్ నేతల నిరసన వార్తలు
హన్మకొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిరసన కోసం ఏర్పాటు చేసిన ఎద్దుల బండి తిరగబడింది.
హన్మకొండలో కాంగ్రెస్ నిరసనలో అపశ్రుతి
అనంతరం తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నేతలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీచూడండి: దోమలగూడలో కేంద్ర బృందం.. కంటైన్మెంట్ జోన్ల పర్యవేక్షణ