తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో కమాండ్​ కంట్రోల్​ కేంద్రం

వరంగల్​ పట్టణ జిల్లా మామునూరు 4వ పటాలంలో హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ కమాండ్​ కంట్రోల్​ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు

కమాండ్​ కంట్రోల్​ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి

By

Published : Jun 15, 2019, 4:20 PM IST

ఏడు వందల కోట్లతో పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలం మామునూరు 4వ పటాలంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. త్వరలో రెండు నూతన పోలీస్​ స్టేషన్లతో పాటు ఒక స్టేడియం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎంపీ పసునూరి దయాకర్, శాసనసభ్యులు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ ప్రకాశ్ పాల్గొన్నారు.

కమాండ్​ కంట్రోల్​ కేంద్రాన్ని ప్రారంభించిన హోంమంత్రి

ABOUT THE AUTHOR

...view details