వరంగల్, హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకంగా మంచి భవిష్యత్తు ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో గొల్ల కురుమల మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ మొత్తం పర్యాటక ప్రాంతమని... హిమాలయాల అందాలు చూడటానికి పర్యాటకులు వస్తారని దత్తాత్రేయ తెలిపారు. వరంగల్ కూడా పర్యాటక ప్రాంతమని... రామప్ప, వేయి స్తంభాల గుడిని నిత్యం వేల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని తెలిపారు. గొల్ల కురుమల్లో చాలా మంది వెనుక బడి ఉన్నారని... వారి అభివృద్ధికి సహయపడతానని చెప్పారు. ప్రతి ఒక్కరు యోగా, స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని సూచించారు.
'హిమాచల్ ప్రదేశ్లాగే వరంగల్ కూడా' - bandaru datthatreya latest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో గొల్ల కురుమల మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఆత్మీయ సమ్మేళనం
Last Updated : Dec 1, 2019, 6:54 PM IST