వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగిన భాజపా మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కుమార్తె వివాహానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆయన ఆశీర్వాదించారు. గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దత్తాత్రేయ తొలిసారి నగరానికి రావటం వల్ల భాజపా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు భాజపా కార్యకర్తలు ఆసక్తి కనబరిచారు.
మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి దత్తన్న హాజరు - Himachal pradesh governor bandaru dattatreya attend of an Bjp Ex MLA's daughter's wedding
హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించారు. కాజీపేటలో భాజపా మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కుమార్తె వివాహానికి హాజరయ్యారు.
మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి దత్తన్న హాజరు
ఈ వివాహానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో పాటుగా జిల్లా నలుమూలల నుండి వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇవీచూడండి: ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.. జీరో ఎఫ్ఐఆర్ ఉందిగా..!
TAGGED:
DHATTHATREYA