ఎండ తాపానికి విలవిలలాడుతున్న జనం - warangal
వరంగల్ అర్బన్ జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ప్రాంతాలలో తీవ్రమైన ఎండలతో వాతావరణం అగ్నిగుండంలా మారుతున్నది. ఎండ, వేడిగాలులతో జనం విలవిలలాడిపోతున్నారు.
భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో సగటున 45 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే... తీవ్రత ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఆరుబయట తిరిగేవారు ఎండదెబ్బను తట్టుకోవడానికి తలపై టోపి, చెవులకు రుమాలు వంటి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని నగరంలోని ప్రతీ కూడలి వద్ద నీడ కోసం గ్రీన్‌షెడ్స్, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ది పేరుతో చెట్లను ఎక్కడికక్కడ కొట్టివేయడంతోనే నగరంలో ఎండల తీవ్రత పెరిగిపోతోందని వయోవృద్ధులు అభిప్రాయపడుతున్నారు.