భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు భాజపా నేతలు ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరిపిన ధర్మాసనం.. రేపటి సభ నిర్వహణకు అనుమతిచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని భాజపాను హైకోర్టు ఆదేశించింది.
అసలేమైందంటే..? ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా రేపు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో భాజపా భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం గురువారం వెల్లడించింది. సభకు పోలీసుల అనుమతి లేదని తెలిపింది. పోలీసుల పర్మిషన్ లేనందున తాము అనుమతించలేమని వివరించింది.
అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న భాజపా శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరిపిన సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సభకు పర్మిషన్ ఇచ్చింది. సభలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరని హామీ ఇవ్వాలని ఆదేశించింది.