వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెలుగు సినిమా కథానాయకుడు, బిగ్ బాస్-3 ఫేం వరుణ్ సందేశ్ సందడి చేశారు. ఆర్ఈసీలోని ఒక సెలూన్ షాప్ ప్రారంబోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్‌కి రావడం చాలా సంతోషంగా ఉందని వరుణ్ సందేశ్ తెలిపారు. గతంలో ఇక్కడకి వచ్చినప్పటికీ... పర్యాటక ప్రదేశాలను చూడలేకపోయానని అన్నారు. హీరోను చూసి ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా తనను చూడడానికి వచ్చిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హన్మకొండలో వరుణ్ సందేశ్ సందడి - BIGG BOSS-3 FAME VARUN SANDESH LATEST NEWS
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో హీరో, బిగ్ బాస్-3 ఫేం వరుణ్ సందేశ్ సందడి చేశారు.
హన్మకొండలో వరుణ్ సందేశ్ సందడి