నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అనాథ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో బాలయ్య అభిమానులు రక్త దానం చేశారు.
వరంగల్లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - tollywood hero balakrishna
వరంగల్ నగరంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వరంగల్లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
నగరంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ నేతృత్వంలో బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.
ఇవీ చూడండి:'నటనలో తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ'