తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​

వరదనీటితో ధర్మసాగర్​ రిజర్వాయర్​ నిండుకుండలా కళకళలాడుతోంది. తుపాకుల గూడెం బ్యారేజి నుంచి రెండు పైపుల ద్వారా రిజర్వాయర్​లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఘన్​పూర్​ నియోజకవర్గంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పైప్​లైన్ల ద్వారా పైకి ఎగిసిపడుతున్న నీటిని పర్యాటకులు వీక్షిస్తున్నారు.

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​

By

Published : Aug 3, 2019, 8:38 AM IST


వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారి కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టుల వద్ద సమృద్ధిగా నీటిలభ్యత ఉండడం వల్ల పైపులైన్ల ద్వారా రిజర్వాయర్లలోకి నీరు విడుదల చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టులోని తుపాకులగూడెం బ్యారేజి నుంచి రెండు పంపుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్​లోకి నీటిని విడుదల చేస్తున్నారు. పైప్​లైన్ల ద్వారా పైకి ఎగిసిపడుతున్న నీటిని పర్యటకులు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి అందాలు, పచ్చదనంతో మైమరిపించే కొండల నడుమ ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ నీటి రాకతో కొత్త అందాలను సంతరించుకుంది. ఘన్​పూర్​ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి అవసరాలకు ధర్మసాగర్​ నీరు ప్రధాన ఆధారం కావడం వల్ల అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది.

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​

ABOUT THE AUTHOR

...view details