తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో డోసు టీకా కోసం పోటెత్తిన జనం

నేటి నుంచి రెండో డోసు టీకా ఇవ్వనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు జనం పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచే టీకా కేంద్రాల్లో బారులు తీరారు. హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రద్దీ నెలకొంది.

heavy rush at vaccination centers, hanmakonda government hospital vaccination
హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వద్దీ, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ

By

Published : May 25, 2021, 12:11 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండడంతో ప్రజలు టీకా కోసం పరుగులు పెడుతున్నారు. నేటి నుంచి రెండో డోసు ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచే వ్యాక్సిన్ కేంద్రాలకు జనం పోటెత్తారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో టీకా కోసం బారులు తీరారు.

ఉదయం 6 గంటల నుంచే టీకా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. రెండో డోసు కోసం గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. కొందరు కొవిడ్ నిబంధనలు గాలికొదిలేసి గుంపులుగా ఉంటున్నారు.

ఇదీ చదవండి:ఐసీఎంఆర్ సూచనలు: ఇలా తాకండి.. అలా తినండి

ABOUT THE AUTHOR

...view details