వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెండో టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఓవైపు పరీక్షలు, మరోవైపు వ్యాక్సినేషన్‌తో ఆరోగ్య కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి.
ఆరోగ్య కేంద్రాల్లో కిటకిట.. ఓవైపు పరీక్షలు, మరోవైపు టీకా! - తెలంగాణ వార్తలు
పట్టణ ఆరోగ్య కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏమాత్రం అనుమానం ఉన్నా జనం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు. ఫలితంగా ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు.
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రద్దీ, హన్మకొండలో టీకా కోసం పడిగాపులు
రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. తొలుత టీకాను నిరాకరించిన ప్రజలు ప్రస్తుతం ఆసక్తి కనబరుస్తున్నారు.