వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్ పట్టణంలోని తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. వర్షపు జల్లులకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
RAINS: వరంగల్లో ఉదయం నుంచి వర్షపు జల్లులు - వరంగల్లో వర్షం
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వరంగల్లో ఉదయం నుంచి వర్షపు జల్లులు
రోడ్లపైకి చేరిన నీటి వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. మురికి కాలువలు పొంగి పొర్లాయి. వారం రోజుల తర్వాత వర్షం కురవడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:covaxin: మూడో దశ పరీక్షల తుది విశ్లేషణలో నిర్ధారణ