భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలోని కాజీపేట్, మడికొండలోని పలు లోతట్టు కాలనీలలో వరద నీరు చేరింది. కాలనీల్లోని అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి.
ఎడతెరిపిలేని వర్షాలు... ప్రజల ఇక్కట్లు - వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ వర్షాలు
గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్, మడికొండ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మడికొండ కాజీపేట్ ప్రధాన రహదారిపై వరద నీరు చేరి వాహన చోదకులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఎడతెరిపిలేని వర్షాలు... ప్రజల ఇక్కట్లు
మడికొండ కాజీపేట్ ప్రధాన రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరికొన్ని చోట్ల మురుగునీరు రోడ్ల పైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది.