వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాల్వలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్ లో భారీ వర్షం.. తడిసి ముద్దైన నగరం - rain in warangle
కొన్ని రోజులగా ఉక్కపోతతో సతమతమౌతున్న వరంగల్ వాసులకు భారీ వర్షంతో ఉపశమనం లభించినట్లైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
![వరంగల్ లో భారీ వర్షం.. తడిసి ముద్దైన నగరం వరంగల్ లో భారీ వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8765140-217-8765140-1599825342804.jpg)
వరంగల్ లో భారీ వర్షం
కొన్ని రోజులగా ఉక్కపోతతో సతమతమౌతున్న వరంగల్ వాసులకు భారీ వర్షంతో ఉపశమనం లభించినట్లైంది. నగరంలోని రహదారులు చెరువులను కనిపిస్తున్నాయి. అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.