వాయుగుండం ప్రభావంతో వరంగల్ నగరంలో వాన జోరుగా కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో నగరం తడిసి ముద్దైంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఏకధాటిగా కురుస్తోన్న వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఓరుగల్లులో జోరువాన... రోడ్లన్నీ జలమయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో వరంగల్ నగరం తడిసి ముద్దైంది. రాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఓరుగల్లులో జోరువాన... రోడ్లన్నీ జలమయం
మురికి కాలువలు పొంగి నీరు రోడ్లపైకి చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి:తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం.. నాలుగైదు గంటలు వర్షగండం