వరంగల్ నగరంలో మంగళవారం రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
వరంగల్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం - తెలంగాణ వార్తలు
వరంగల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు నిలిచింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వరంగల్లో భారీ వర్షం, వాన
డ్రైనేజీ నీళ్లు రోడ్లమీదకు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో వరద నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:LOCKDOWN: రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగింపు