వరంగల్లో జోరుగా వర్షం కురుస్తుంది. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ... జల్లు పడుతోంది. గత కొన్ని రోజులుగా ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు... 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. నగరమంతా కారు మబ్బులు కమ్ముకుని వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్లో మోస్తారు వర్షం కురిసింది. వాన నీటితో రోడ్లు జలమయమయ్యాయి.
భారీ వర్షాలతో ప్రజల్లో ఆనందోత్సాహాలు... - HEAVY RAIN IN WARANGAL DISTRICT
వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచినా వర్షాలు లేక తీవ్ర నిరాశకు గురైన ప్రజలకు... రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఉత్సాహాన్నిస్తున్నాయి. వరంగల్లోని పలు మండలాల్లో ఎడతెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి.
HEAVY RAIN IN WARANGAL DISTRICT