వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతుకు నీరు వచ్చేయగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరగా.. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఓరుగల్లులో భారీ వర్షం.. మోకాళ్లలోతుకు చేరిన నీరు - వరంగల్ జిల్లా వానలు వార్తలు
వరంగల్ జిల్లావ్యాప్తంగా గంటపాటు భారీ వర్షం కురిసింది. మోకాళ్ల లోతుకు నీరు రాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతంలోకి వర్షపు నీరు రాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఓరుగల్లులో భారీ వర్షం.. మోకాళ్లలోతుకు చేరిన నీరు
వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గంటకు పైగా వర్షం కురిసింది. జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్, తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట, ఏటూరి నాగారం, వాజేడు మండలాల్లో కుండపోత వాన కురిసి వాతావరణమంతా చల్లగా మారింది.