తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ నగరంలో జోరుగా వర్షం... జలమయమైన రోడ్లు

వరంగల్​, హన్మకొండ, కాజీపేట, తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం నుంచి భానుడి భగభగలతో అల్లాడిన నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగింది.

heavy rain in warangal city
వరంగల్​ నగరంలో జోరుగా వర్షం... జలమయమైన రోడ్లు

By

Published : May 18, 2020, 10:28 PM IST

వరంగల్ నగరంలో జోరుగా వర్షం కురిసింది. ఈ వాన వల్ల నగరం తడిసి ముద్దయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి.

డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు ఈ వర్షం వల్ల కాస్త ఉపశమనం లభించింది.

ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!

ABOUT THE AUTHOR

...view details