వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కురిసి వర్షం రైతులకు వేదన మిగిల్చింది. పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత పడగా...పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయ్యింది. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలంలో లింగాపురం గ్రామంలో పిడుగుపాటుకు కుమార స్వామి, మేగ్యాతండాకు చెందిన ఆజ్మీర రామస్వామి మృత్యువాత పడ్డారు. ఆత్మకూరు మండలంలో ఈదురుగాలులకు కటాక్షాపూర్ రహాదారిపై భారీగా చెట్లు నేలకూలాయి.
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం, పిడుగుపాటుకు ఇద్దరి బలి - haevy rain in warangal
రోజంతా భానుడి ప్రతాపంతో భగభగలాడగా... సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
అకాల నష్టం మిగిల్చింది రైతులకు అపార నష్టం
నల్లబెల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. .మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో భారీ వర్షం కురవగా... ఇనుగుర్తి, అయ్యగారిపల్లె గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పలు చోట్ల ఇళ్లపైనున్న రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.