వరంగల్ నగరాన్ని వర్షం వీడటం లేదు. బుధవారం నుంచి భారీగా వర్షం పడుతోంది. రాత్రి నుంచి వాన కురుస్తుండటం వల్ల హన్మకొండలోని ప్రధాన రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అవుతోంది. మధ్యలో ఒక రోజు తరువాత మళ్లీ వాన జోరందుకుంది.
వరంగల్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - హన్మకొండ తాజా వార్తలు
హన్మకొండలో భారీగా వర్షం కురుస్తోంది. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
![వరంగల్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు Heavy rain in hanamkonda Roads look like ponds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8485438-257-8485438-1597891657818.jpg)
భారీ వర్షం..చెరువులను తలపిస్తున్న రోడ్లు
భారీ వర్షం..చెరువులను తలపిస్తున్న రోడ్లు
భారీ వర్షాలతో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ముంపు ప్రాంతాల కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షానికి నగర వాసులు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఇదీ చూడండి :హైదరాబాద్లో 6.6 లక్షల మందికి కరోనా!