తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండులు... - Lock down 4.0

ఇన్ని రోజులు ఒక్క మనిషి కూడా లేకుండా బోసిపోయిన బస్టాండులు నేడు... ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. బస్సు సేవలు నిన్నటి నుంచి మొదలైనప్పటికీ... రెండో రోజున జనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణ ప్రాంగణాలకు చేరుకుంటున్నారు.

Heavy flow to hanmakonda busstands
Heavy flow to busstands

By

Published : May 20, 2020, 1:26 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. మొదటి రోజు అంతంత మాత్రమే రాగా... రెండో రోజు మాత్రం వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రయాణ ప్రాంగణానికి చేరుకున్నారు.

ప్రయాణికులు ఎక్కువగా రావటం వల్ల రెండో రోజు బస్సులను అధికారులు ఎక్కువ సంఖ్యలో నడుపుతున్నారు. సామాజిక దూరం పాటిస్తూ... సీటుకు ఇద్దరూ మాత్రమే కూర్చొని ప్రయాణం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించటమే కాకుండా... బస్సు ఎక్కేటప్పుడు ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఆర్టీసీ బస్టాండ్ నేడు ప్రయాణికులతో కిటకిటలాడింది.

ABOUT THE AUTHOR

...view details