వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకు ముందుగా నిరుపయోగంగా మారిన ఎంఆర్ఐ సిటీ స్కాన్ విభాగాన్ని పరిశీలించారు. హైదరాబాదుకు రోగులు తరలి వెళ్లకుండా అన్ని వైద్య సదుపాయాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు, కావాల్సిన అవసరాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఎంజీఎం పూర్వవైభవానికి కృషిచేస్తాం: ఈటల - Health minister Etala rajendar
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. రోగులు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్నీ వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎంజీఎం పూర్వవైభవానికి కృషిచేస్తాం: ఈటల