వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. తెరాస ఆధ్వర్యంలో నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రాణాల కంటే ఆస్తులు గొప్పవి కాదని... ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నందున లాక్‌డౌన్ ఎత్తివేయోద్దని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి ఈటల - వరంగల్ అర్బన్‌లో మంత్రి ఈటల పర్యటన
కరోనా వైరస్‌తో అమెరికా, ఇటలీ దేశాలను చూసిన తర్వాత ఇక్కడి ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో కార్మికులకు, జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి ఈటల
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. హైదరాబాద్ నగరంలోనే కరోనా వైరస్ సోకిన రోగులు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. పల్లెలకు కరోనా మహమ్మారి రాకుండా కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి..కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ హోమం