రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆరో విడత హరితహారం వరంగల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 22వ డివిజన్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, కమిషనర్ పమేల సత్పతి, సీపీ రవీందర్ మొక్కలు నాటారు.
హరితహారం... సీఎం కేసీఆర్ మానస పుత్రిక: ఎమ్మెల్యే నన్నపనేని
వరంగల్లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఐదు విడతలుగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఈ సారి కూడా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రజలను కోరారు. హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని పేర్కొన్నారు.
'హరితహారం... సీఎం కేసీఆర్ మానస పుత్రిక'
హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని ఎమ్మెల్యే తెలిపారు. గత ఐదేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ సారి కూడా విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. నూతన మున్సిపల్ చట్టంలో ప్రతీ మున్సిపాలిటీ బడ్జెట్లో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చు చేసే విధంగా నిర్ణయించినట్లు తెలిపారు. అవసరాలకు అనువైన మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?
TAGGED:
plantation program