తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ముగిసిన యువతి అంత్యక్రియలు - warangal harathi murder case

వరంగల్​లో ఓ ఉన్మాది చేతిలో శుక్రవారం హత్యకు గురైన యువతి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

harathi's dead body cremation got completed in warangal
వరంగల్​లో ముగిసిన యువతి అంత్యక్రియలు

By

Published : Jan 11, 2020, 7:55 PM IST

వరంగల్​లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతికి నేడు పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత హన్మకొండ లష్కర్​ సింగారంలోని యువతి నివాసానికి మృతదేహాన్ని తరలించారు.

యువతిని కడసారి చూసుకోవడానికి బంధువులు, కాలనీవాసులు తరలివచ్చారు. తమ కళ్ల ముందు తిరిగే అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

యువతి తల్లి మృతదేహంపై పడి నన్ను విడిచి వెళ్లిపోతున్నావా తల్లి అంటూ రోదించడం అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. హన్మకొండలోని పోచమ్మకుంటలో యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వరంగల్​లో ముగిసిన యువతి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details