తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి - హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి

ప్రేమకు కుల, మతాలే కాదు... ఎల్లలూ అడ్డుకావని నిరూపించారు హన్మకొండకు చెందిన అబ్బాయి... ఆస్ట్రేలియాకు చెందిన అమ్మాయి. కేవలం ప్రేమే కాదండోయ్ పెళ్లి కూడా చేసుకొని ఒక్కటైపోయారు.

హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి

By

Published : Nov 22, 2019, 7:55 PM IST

Updated : Nov 22, 2019, 8:13 PM IST

కులం, మతం, రంగు, భాష.. ఇలాంటివేవీ ప్రేమకు అడ్డుకావని మరోసారి నిరూపించారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హన్మకొండకు చెందిన దినేష్ బాబు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే డెమీ పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

విదేశీ వధువు తెలుగు సంప్రదాయ పద్థతిలో చీరకట్టుకొని అందంగా ముస్తాబయింది. బంధుమిత్రులతోపాటు.. పలువురు విదేశీ అతిథులు కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, చాలా గొప్పవని... వధువు డెమీ మార్గెరెట్ పేర్కొన్నారు.

హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Last Updated : Nov 22, 2019, 8:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details