Hanamkonda Court Hearing on Bandi Sanjay Bail Cancellation: హనుమకొండ కోర్టులో బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సాగింది. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు కొనసాయి. సంజయ్ తరఫున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగానే దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈనెల 6న సంజయ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అసలెేం జరిగిదంటే:పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్‌లో జడ్పీ పాఠశాలలో జరిగిన లీకేజీ కేసులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయన ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించారని పేర్కొన్నారు. వాటిని వాట్సప్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని పోలీసులు ఆరోపించారు. ఆయనపై 120 (బి), 420, 447, 505 (1)(బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్‌విత్ 8 ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-1997, సెక్షన్ 66-డి ఐటీ యాక్ట్-2008 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోవైపు ఈ కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఆయన పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న ఈటల హనుమకొండ డీసీపీ కార్యాలయంలో హాజరయ్యారు. పోలీసులు చెబుతున్నట్లుగా ప్రశాంత్ నుంచి తనకు ఎలాంటి ఫోన్‌కాల్ రాలేదని పేర్కొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈటల రాజేందర్‌ను విచారించారు.
విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. లీకేజ్ విషయంలో తనకు జర్నలిస్ట్ ప్రశాంత్ నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని అధికారులు ఆరోపించారని ఈటల అన్నారు. విచారణకు తన మొబైల్‌తో సహా విచారణకు హాజరైనట్లు తెలిపారు. తన ఫోన్‌ని అధికారులు తమ సమక్షంలో పరిశీలించినట్లు వెల్లడించారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని నిర్ధరించుకున్నారని చెప్పారు. తన సెల్‌ఫోన్‌కు మహేశ్ వాట్సప్ మెసేజ్ పంపాడని.. ఇతరులకు ఎవ్వరికి తాను మెసేజ్ పంపలేదని అధికారులు నిర్ణయించుకున్నట్లు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.