Hanamkonda Bus Stand :వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు ఉండటం సాధారణం. ప్రజలు ఎక్కువ తిరిగే ప్రదేశాల్లో సమస్యలుంటే అధికారులు వాటిని బాగు చేసేస్తారు. మరీ రద్దీ ప్రదేశాల్లో అయితే రోజుల వ్యవధిలోనే రోడ్లను, ప్రదేశాలను బాగు చేయిస్తారు. కానీ ఈ నగరాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా ఈ నగరానికి చారిత్రక ప్రదేశంగా పేరు, రోజుకు ఇక్కడ వేలమంది ప్రయాణిస్తుంటారు. బాగు చేయించకపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ, ప్రజలు మాత్రం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు.
hanamkonda Bus Stand Road Damage :వర్షం వస్తే.. హనుమకొండ ప్రయాణికుల ప్రాంగణం.. చెరువులా మారుతోంది. నీళ్లలోంచి వెళ్లలేక.. జనం నానా ఇక్కట్లు పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో.. పలువురు నీళ్లలో పడి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఎవరికేం జరిగినా... బస్టాండ్ తీరు మాత్రం మారట్లేదు. హైదరాబాద్ తరువాత.. అంతటి ప్రఖ్యాతి గాంచిన నగరం .. హనుమకొండ. కానీ అక్కడ ఉన్న బస్టాండ్ పరిస్ధితి మాత్రం దయనీయంగా మారుతోంది. వర్షం వస్తే చాలు బస్టాండ్ పరిసరాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి. చెరువును తలపించే విధంగా.. ప్రయాణ ప్రాంగణం మారిపోతోంది. నీళ్లలోంచే.. ప్రయాణికులు వెళ్తూ.. నానా అగచాట్లు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. ఏ గుంత ఉందో అని ప్రజలు భయాందోళనరు గురవుతున్నారు.
"బస్‌స్టాండ్‌లో చాలా నీరు వచ్చింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరంగల్‌లో హనుమకొండ అంటే ఎంత బాగుండాలి కానీ ఒక్క వర్షానికే బస్‌స్టాండ్‌లోకి అంతా నీరు చేరిపోయింది. చాలా ఇబ్బంది కరంగా ఉంది." - స్థానికుడు