లాక్డౌన్ సడలింపుల కారణంగా వరంగల్లో సెలూన్ దుకాణాలు తెరుచుకున్నాయ్. చాలా చోట్ల క్షురకులు జాగ్రత్తలు తీసుకుని జుత్తు కత్తిరిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించి క్షౌరం - warangal latest news today
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో క్షౌర దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వరంగల్లో కరోనా దృష్ట్యా సెలూన్ దుకాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించి కటింగ్ చేస్తున్నారు. శానిటైజర్ వాడుతున్నారు.
మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించి క్షౌరం
మాస్కులు లేనిదే ఎవరినీ లోపలికి రానీయట్లేదు. దుకాణాల్లో కూడా భౌతిక దూరం పాటిస్తున్నారు. తరచూ శానిటైజర్లూ వాడుతున్నారు. వచ్చినవారికి కొంచెం దూరంగానే ఉంటూ కటింగ్, షేవింగ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి :పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు