వరంగల్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. వరుణుడి ప్రతాపానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ, కాజీపేట తదితర పట్టణాలు తడిసి ముద్దయ్యాయి.
వరంగల్లో కుండపోత వర్షం.. రహదారులు జలమయం - వరంగల్ వార్తలు
వరంగల్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హన్మకొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో జోరువానకు రహదారులన్నీ జలమయమయ్యాయి.
వరంగల్లో భారీ వర్షం
వరద నీటితో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి చేరడం వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:బడి బియ్యం.. పురుగులపాలు!