వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం నూతన శోభను సంతరించుకుంది. మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో కార్యాలయం ఆవరణలోని క్యాంటీన్‌ను రంగు రంగుల బొమ్మలతో అందంగా ముస్తాబు చేశారు. గోడలపై ఏకశిలా ఆర్ట్ క్రియేషన్ చిత్రకారులు వేసిన చిత్రాలు ఆకర్షిస్తున్నాయి.
అదిరే రంగులతో ముస్తాబైన జీడబ్లూఎంసీ క్యాంటీన్ - వరంగల్ మహానగర పాలక సంస్థ వార్తలు
వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం క్యాంటీన్ కొత్త రూపు సంతరించుకుంది. క్యాంటీన్ గోడలపై రంగురంగుల బొమ్మలు వేశారు. క్యాంటీన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.
![అదిరే రంగులతో ముస్తాబైన జీడబ్లూఎంసీ క్యాంటీన్ gwmc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8243981-720-8243981-1596187937026.jpg)
gwmc
స్మార్ట్ సిటీలో భాగంగా కార్యాలయానికి కొత్త శోభను తీసుకురావాలనే ఆలోచనతో కార్యాలయ గోడలతో పాటు క్యాంటీన్‌ను అందంగా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి కషాయం తాగారు.
ఇదీ చదవండి:నిర్లక్ష్యం వద్దు.. కరోనాకు చంపే శక్తి లేదు: మంత్రి ఈటల