అభివృద్ధి అజెండాగా వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. బల్దియా కౌన్సిల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు హాజరయ్యారు.
స్మార్ట్ సిటీ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని ఎమ్మెల్సీ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఓరుగల్లులో గత కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు యువతులపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలు వెలుగుచూశాయని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని ఎమ్మెల్సీ తెలిపారు.