తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ... రూ.70వేలకు పైగా జరిమానాలు - వరంగల్ అర్బన్ లేటెస్ట్ న్యూస్

వరంగల్​ పట్టణం జిల్లా కేంద్రం, కాజిపేటలో శానిటరీ సూపర్​వైజర్ సాంబయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్యంపై డాక్టర్ రాజీరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 52, 53 డివిజన్ల సిబ్బందిపై జరిమానా విధించారు. ప్రధాన కూడళ్లలో ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాల నుంచి అపరాధ రుసుం వసూలు చేశారు. బల్దియా అధికారులు ఒక్క రోజులోనే మొత్తం రూ.70వేలకు పైగా జరిమానాలు విధించారు.

GWMC FINES ON SHOPS AT KAZIPET WARANGAL IN WARANGAL URBAN DISTRICT
పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ... రూ.70వేలకు పైగా జరిమానాలు

By

Published : Oct 7, 2020, 2:15 PM IST

వరంగల్ పట్టణ జిల్లా కేంద్రం, కాజిపేటలో ప్లాస్టిక్ వినియోగదారులపై మహా నగర పాలక సంస్థ అధికారులు జరిమానా విధించారు. డాక్టర్ రాజిరెడ్డి ఆకస్మికంగా 52, 53 డివిజన్లలో పర్యటించి పారిశుద్ధ్యం సరిగా లేనందున 52 డివిజన్ జవాన్​కు రూ.2 వేలు, 53 డివిజన్ జవాన్​ నుంచి రూ.3 వేలు అపరాధ రుసుం వసూలు చేశారు. శానిటరీ సూపర్‌వైజర్ సాంబయ్య ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి దుకాణదారులపై మొత్తం రూ.36,300 జరిమానాలు విధించారు.

ఒక్కరోజులోనే రూ.70వేలకు పైగా...

కాజిపేటలో పండ్ల మార్కెట్ ప్రాంతంలోని పలు దుకాణాలతో పాటు, వెంకట్రామ జంక్షన్ ప్రాంతంలో శ్రీరామ హోటల్, సోమిడి ప్రధాన రహదారి ప్రాంతంలో కిరాణా, మిఠాయి దుకాణదారులు ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు విక్రయిస్తూ... వాటిని ఉపయోగించి స్థానిక మురుగుకాలువల్లో పడేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోతున్నందున వారిపై రూ.33,300 జరిమానాలు విధించారు. ఒక్క రోజులోనే బల్దియా అధికారులు రూ.70 వేల పైచిలుకు అపరాధ రుసుం వసూలు చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు

ABOUT THE AUTHOR

...view details