వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి బిల్ కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను, నీటిపన్ను బకాయిలపై ఆరా తీసిన కమిషనర్.. మొండి బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
'మెుండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి' - 'మెుండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి'
మెుండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని బిల్ కలెక్టర్లకు సూచించారు వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి. బిల్ కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి.. ఆస్తి పన్ను, నీటి పన్ను బకాయిలపై ఆరా తీశారు.
!['మెుండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి' gwmc_Commissioner_meeting with bill collectors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7156530-582-7156530-1589208281564.jpg)
'మెుండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలి'
ఆస్తి, నీటి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పించాలని అధికారులకు సూచించారు. మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు నోటీసులను జారీ చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి: వైద్యులు