తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారుల దాడులు - వరంగల్​ వార్తలు

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని రంగశాయిపేట, కాశిబుగ్గలలో ప్లాస్టిక్ వాడకందారులపై బల్దియా అధికారులు జరిమానాలు విధించారు. ఎనిమిదో డివిజన్ గవిచర్ల క్రాస్​రోడ్​లో మద్యం దుకాణ యజమానికి రూ.20వేలు, పదమూడో డివిజన్​లోని కాశిబుగ్గ ప్రాంతంలో కిరాణా, మిఠాయి దుకాణాల వ్యాపారులకు అపరాధ రుసుము విధించారు.

ప్లాస్టిక్​ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారుల దాడులు
ప్లాస్టిక్​ వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారుల దాడులు

By

Published : Sep 24, 2020, 11:26 PM IST

ప్లాస్టిక్​ వస్తువులు, గ్లాసులు విక్రయిస్తున్న దుకాణాల యజమానులకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. వరంగల్​ మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు అమ్ముతున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. గురువారం ఒక్క రోజే నగరంలోని పలు దుకాణాలపై దాడులు చేసి 70 వేలకు పైగా జరిమానా విధించినట్లు ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్ బాజిరెడ్డి తెలిపారు.

ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు, శానిటేషన్ సిబ్బంది కృషి చేస్తున్నామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేస్తే వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని... రహదారులపై ఉమ్మితే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

ABOUT THE AUTHOR

...view details