సాయి నామస్మరణతో వరంగల్ నగరం మార్మోగింది. గురుపౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి బాబా దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. కొవిడ్- 19 విజృంభిస్తున్న నేపథ్యంలో సాయి బాబా ఆలయ కమిటీలు అన్ని రకాల సేవాలను నిలిపివేశాయి. భద్రకాళీ ఆలయ సమీపంలోని బాబా ఆలయంలో ప్రతిఏటా నిర్వహించే సాయి ఏకనామస్మరణ రద్దు చేశారు.
సాయి నామస్మరణతో మార్మోగిన ఓరుగల్లు - వరంగల్లో గురుపౌర్ణమి వేడుకలు
ఆదివారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో తెలవారుజామునుంచే ఆలయాలను అర్చకులు వివిధ రకాల పూలతో అలంకరించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయ కమిటీలు అన్ని రకాల సేవాలను రద్దు చేశాయి. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులను ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
సాయి నామస్మరణతో మార్మోగిన ఓరుగల్లు
కృష్ణకాలనీలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను కరోనా వైరస్ కారణంగా అంతంత మాత్రంగానే నిర్వహించారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులను 10 సంవత్సరాల పిల్లలకు ఆలయ ప్రవేశంను పాకిక్షంగా నిలిపివేశారు. బాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం ఆలయంలోనికి అనుమతిస్తున్నారు.