కరోనా సామాన్యుల జీవితాలను కకావికలం చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కష్టతరమవుతోందని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కడియం ఫౌండేషన్ ద్వారా వృద్ధ, దివ్యాంగ ఆశ్రమాలకు కడియం ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను అందించారు.
Kadiyam Srihari: స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలవడమే మా లక్ష్యం - హన్మకొండలో కడియం నిత్యావసరాల పంపిణీ
కరోనా సమయంలో సామాజిక సేవే లక్ష్యంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తామని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వృద్ధ, దివ్యాంగుల ఆశ్రమాలకు కడియం ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను అందజేశారు.
కరోనా కష్టకాలంలోనూ సామాజిక సేవే పరమార్థంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చేదోడు వాదోడుగా ఉండడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుత తరుణంలో వారిని ఆదుకోవడం గురుతర బాధ్యతగా భావించి ముందుకు వచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. కరోనా వల్ల స్వచ్ఛంద సేవాసంస్థల మనుగడ కష్టసాధ్యంగా మారిందని వెల్లడించారు. వృద్ధులకు సేవ చేస్తున్న సహృదయ సంస్థకు అండగా ఉంటామన్నారు. నగరంలోని అతిథి, మల్లికాంబ, స్పందన మానసిక వికలాంగుల ఆశ్రమాలలో సుమారు రెండున్నర లక్షల రూపాయల నిత్యావసరాలను డాక్టర్ కడియం కావ్య, కడియం రమ్యతో కలిసి పంపిణీ చేశారు.