వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ హాజరై నిరుపేద గీత కార్మికుల కుటుంబాలకు సరుకులు అందజేశారు.
గీత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - corona effect
లాక్డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులకు వరంగల్ జిల్లా గౌడ సంఘం అండగా నిలిచింది. ముగ్గరు ఎమ్మెల్యేల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది.
![గీత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ groceries distributed by 3 mla in hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7221127-451-7221127-1589618725813.jpg)
గీత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులను దృష్టిలో పెట్టుకొని గౌడ సంఘం సరుకులను పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యేలు కొనియాడారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు.