గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే ముమ్మరంగా జరుగుతోంది. మొత్తం 66 వార్డుల్లో నగరపాలక సిబ్బంది.. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. బల్దియా సిబ్బందికి తోడుగా.. రెవెన్యూ శాఖ వీఆర్వోలనూ నియమించడం వల్ల సర్వే వేగంగా జరుగుతోంది.
- ఓటర్ల సర్వే ముగింపు గడువు - ఏప్రిల్ 7
- అభ్యంతరాల స్వీకరణ - ఏప్రిల్ 11
- అభ్యంతరాల పరిష్కారం - ఏప్రిల్ 13
- వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన - ఏప్రిల్ 14