వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే తొలుత స్వామివారికి ఆలయంలో దివ్యాలంకరణ చేశారు. అనంతరం అంకురార్పణ, ధ్వజపటలం, ధ్వజమాలాయుక్తంగా నందీశ్వరునితో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరభద్ర స్వామి కల్యాణం కోసం స్వామి వారికి, భద్రకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ కుమార్.
ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం - ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం
ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వామివారి కల్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు.
![ఘనంగా భద్రకాళీ అమ్మవారితో వీరభద్రుడి కల్యాణం kalyanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5670246-705-5670246-1578714624700.jpg)
ముందుగా మహోత్సవ వేడుకలలో గణపతి పూజ నిర్వహించి వీరభద్ర స్వామి వారి పక్షాన ఆలయ ప్రధానార్చకులు కల్యాణ తంతు నిర్వహించారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి పక్షాన స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఆలయ ఇఓ సులోచన వీరభద్ర స్వామి వారి కల్యాణానికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని కన్యాదానం చేశారు. తదనంతరం అర్చకులు మాంగళ్యధారణ చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఈ నెల 18వ తేదీన అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించునన్నారు.
ఇవీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది సజీవదహనం