రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అర్హులైన 32 మంది లబ్ధిదారులకు 25 లక్షల 21 వేల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులు అందించారు.
'ఎన్ని నిషేధాలు విధించినా కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం' - ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండల కేంద్రంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కులు అందించారు. 25 లక్షల 21 వేల రూపాయల విలువ చేసే చెక్కులను 32 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, నిధులను కేంద్రం ఇచ్చేంత వరకు తాము పోరాడుతామన్నారు. నలబై ఏళ్ల నుంచి పలు పార్టీల నాయకులు పోరాడారని ఆయన గుర్తుచేశారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కృషి చేస్తుందని... ఎన్ని నిషేధాలు విధించినప్పటికీ తాము సాధిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి'