తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు - Governor Warangal tour

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్ పర్యటన ఖరారైంది. ఈనెల 9న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గానా వరంగల్ వెళ్లనున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు.

Governor Warangal tour finalized
గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

By

Published : Dec 7, 2019, 11:41 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్ పర్యటన ఖరారైంది. ఈనెల 9న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని వరంగల్ చేరుకుంటారని రాజ్​భవన్​ వర్గాలు తెలిపాయి. వరంగల్​లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు సందర్శణతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్ ఔషధి జనరిక్ మెడికల్ షాప్ సందర్శించి రాత్రి హరిత కాకతీయలో బస చేయనున్నారు.

గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

కాళేశ్వరం పర్యటన

10న వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం లక్ష్మి పంపు హౌస్​తో పాటు బ్యారేజ్​ను సందర్శించనున్నారు. రాత్రి ఎన్​టీ పీసీ వసతి గృహంలో బస చేస్తారని అధికారులు తెలిపారు. 11న ఉదయం రోడ్డు మార్గం ద్వారా పెద్దపెల్లి జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇవీ చూడండి : న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

ABOUT THE AUTHOR

...view details