Governor Tamilisai Visited Warangal Flood Affected Areas :పది రోజుల పాటు రాష్ట్రంలో కురిసినభారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల వారి జీవితాలను అస్తవ్యస్థంగా మార్చాయి. ఇళ్లు కోల్పోయి కొందరు.. పంట పొలాల్లో నీటమునిగి మరికొందరు.. వరదల్లో ఆత్మీయులతో పాటు సర్వం కోల్పోయి ఇంకొందరు.. ఇలా వరద బీభత్సం ఎంతో మంది జీవితంలో కల్లోలం సృష్టించింది. ముఖ్యంగా భారీ వర్షాలు-వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాను ముప్పుతిప్పలు పెట్టాయి. ఆ జిల్లాలో ఎవరిని కదిపినా కంటనీరే.. ఎవరితో మాట్లాడినా గొంతు నిండా విషాదమే కనిపిస్తోంది.
Governor Tamilisai visits Flood Affected Warangal :వరద మిగిల్చిన విషాదంతో ఇప్పుడిప్పుడే ఇళ్ల బాట పడుతున్న వారికి వారి ఇళ్లను చూస్తే గుండె పగిలేటంతటి బాధ వేస్తోంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా కూలిన ఇళ్లకు, నీటమునిగిన పంటపొలాలను చూసి బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ సరైన హామీ ప్రకటించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా వారికి సరైన భరోసా కల్పించలేకపోతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇళ్లు కూల్పోయామంటూ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరుతున్నారు.
Hanamkonda Floods 2023 :తాజాగా ఓరుగల్లులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై పర్యటించారు. ఉమ్మడి వరంగల్‌లోని ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితుల గోడు విన్నారు. మొదట పలు ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించిన గవర్నర్.. అనంతరం ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తమిళిసై.. మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందుగా హనుమకొండలోని జవహర్‌నగర్, నయీమ్‌నగర్, పోతననగర్ ముంపుప్రాంత ప్రజలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు, ఆరోగ్యకిట్లను అందజేశారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్‌తోపాటు ఎన్ఎన్నగర్ ముంపు ప్రాంతాలను గవర్నర్ సందర్శించారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు గవర్నర్ ఎదుట వాపోయారు.