ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే గదిలో ఐదు తరగతులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. కాగా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి రెండు గదులుండగా.. రెండేళ్ల కిందట నీటి ట్యాంకు కోసం ఓ గదిని కూల్చివేశారు.
ఉన్న ఒక్క గదిలో అడ్డుగా పరదా కట్టి ఒకవైపు ఐదు తరగతులు.. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆ గదిలోనే మధ్యాహ్న భోజన సామగ్రి, రికార్డులు సైతం ఉంచారు. ఆ బడిలో గతేడాది 78 మంది విద్యార్థులు ఉండగా.. వసతులు లేని కారణంగా ప్రస్తుతం 37 మందికి తగ్గారు.