వరంగల్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలెవ్వరూ రావద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాలం, వాట్సాప్, మెసెంజర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తాహసీల్దార్ ఇక్బాల్ వెల్లడించారు. దీనివల్ల వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన వారు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
'వాట్సాప్, మెసెంజర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం' - Government Office closed due to Corona virus latest news
ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం వచ్చేపోయే వారితో సందడిగా ఉండే కార్యాలయాలు... ఇప్పుడు భయం నీడన పనిచేస్తున్నాయి. అత్యవసర పనుల కోసం కొందరు వస్తూనే ఉన్నారు. వాట్సాప్, మెసెంజర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని వరంగల్లో తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు.
వాట్సాప్, మెసెంజర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం
సేవల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్, మెసెంజర్ ద్వారా త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో తప్ప ఇతరులను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.