Museum in Warangal fort: వరంగల్‌లోని మహానగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర పురావస్తు శాఖ ప్రదర్శనశాల ఉంది. ఇందులో 1250 వరకు శాసనాలు, శిల్పాలు, కాకతీయులు వాడిన వస్తువులు భద్రపరిచారు. గతంలో ఈ ప్రాంతంలోనే నక్షత్రశాల, మ్యూజికల్ గార్డెన్ కూడా ఉండేది. అప్పుడు ఈ మ్యూజియాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. నక్షత్రశాల, మ్యూజికల్ గార్డెన్ పూర్తిగా మూతబడ్డాక ప్రదర్శనశాలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పురావస్తు మ్యూజియాన్ని వరంగల్ కోటలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో వరంగల్ కోట(foundation stone for museum in warangal fort)లోని స్వాగత తోరణాలకు సమీపంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రదర్శనశాల భవనానికి శంకుస్థాపన చేశారు. రూ. 3 కోట్ల 80 లక్షలు మంజూరయ్యాయి. కానీ ఆరేళ్లు గడుస్తున్నా ప్రదర్శనశాల నిర్మాణం పూర్తి కాలేదు.
శిథిలావస్థకు నూతన కట్టడం
ఇప్పుడు ఈ ప్రదర్శనశాల అసంపూర్తిగా మిగలడంతో అసాంఘిక(Archaeological Museum in warangal fort) కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒకవైపు గోడల పెచ్చులన్నీ ఊడిపోతుండగా, ఆవరణలో పిచ్చి మొక్కలు మొలిచాయి. రాత్రివేళ మందుబాబులు భవనంలో సిగరెట్లు కాల్చి పారేయడం, మద్యం సేవించడం లాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా పట్టించుకునేవారు లేరు. పర్యాటక శాఖ ఈ భవనం నిర్మాణం పూర్తి చేసి పురావస్తు శాఖకు అప్పగిస్తే వారు పాత మ్యూజియంలోని విలువైన చారిత్రక సంపదను ఇందులోకి తరలించాల్సి ఉంది. కోటలో పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.