తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆకలితో ఎవరూ పస్తులు ఉండకూడదు' - వినయభాస్కర్​ నిరుపేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వ ఛీప్​ విప్​ వినయ్ భాస్కర్​ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలెవరూ ఆకలితో పస్తులు ఉండకూడదనే సీఎం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

'ప్రజలెవ్వరూ ఆకలితో పస్తులు ఉండకూడదు'
'ఆకలితో ఎవరూ పస్తులు ఉండకూడదు'

By

Published : May 13, 2020, 7:44 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్ భాస్కర్​​ నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని సాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్ నిబంధనలను ప్రజలందరూ తూ.చ తప్పకుండా పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details